The Desk… Amaravati : చంద్రబాబుకు రూ.95 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన డా. కామినేని

The Desk… Amaravati : చంద్రబాబుకు రూ.95 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించిన డా. కామినేని

అమరావతి : THE DESK :
విజయవాడ ముంపు బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కైకలూరు శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ నిధులను సేకరించారు.

కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన నిధులు మొత్తం రూ.95,00,000/- లక్షల చెక్కును ఆయన మంగళవారం వెలగపూడి సీఎం ఆఫీస్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

బాధితులకు విరాళాలు అందించిన దాతలు అందరికి పేరుపేరునా ఎమ్మెల్యే కామినేని కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం విరాళాలు సేకరణ, దాతల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కామినేని వివరించారు.