అమరావతి : సచివాలయం : ది డెస్క్ :
2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,807 కోట్ల బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వ హామీల అమలుకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ప్రజలకు నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలపై అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తెలిపారు.
ఈ బడ్జెట్‌లో భాగంగా, బియ్యం, గోధుమలు, చక్కెర, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసర వస్తువులను ప్రభుత్వ రేషన్ ద్వారా ప్రజలకు అందించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించామని మంత్రి వివరించారు.
అలాగే, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం వంటి బాధ్యతలు పౌర సరఫరాల శాఖకు ఉన్నాయని తెలిపారు. తాజాగా వంట నూనెల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, సరఫరా పెంచేందుకు వంట నూనెల దిగుమతిదారులు, కందిపప్పు సరఫరాదారులతో సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మరియు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.