🔴 అమరావతి : THE DESK : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామ సభ నిర్వహణ, అందుకు సంబంధించిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తున్న ఉప ముఖ్యమంత్రి.
ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల నిర్వహణ చేపట్టాలి. ఉపాధి హామీ పథకం పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టవచ్చు.
ఈ పథకం ద్వారా రూ. వేల కోట్లు నిధులు వెచ్చిస్తున్నాం. ప్రతి రూపాయినీ బాధ్యతతో వ్యయం చేయాలి. ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలి.
జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలులో బాధ్యత తీసుకోవాలి. సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలి.
వీడియో కాన్ఫరెన్స్ లో సచివాలయం నుంచి పి.ఆర్. & ఆర్.డి. ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 26 జిల్లాల నుంచి జడ్పీ సీఈవోలు, డి.పి.ఓ.లు, డ్వామా పీడీలు, మండలాల్లో ఎంపీడీఓలు, ఈవో పిఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఏపీఓలు పాల్గొన్నారు.