- మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..!!
- “హర్షం వ్యక్తం” చేసిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి
- CM లేదా CMO నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు ఏపీ సర్కార్ కార్యాచరణ..!!
🔴 అమరావతి /ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
నామినేషన్ ప్రక్రియ ద్వారా అమరావతి బ్రాండ్ అంబాసిడర్ల ఎంపిక
నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా ప్రభుత్వ అనుమతి తీసుకుని బ్రాండ్ అంబాసిడర్లను CRDA ఎంపిక చేసి, ఒక ఏడాది కాలానికి వీరిని నియమించుకుని తదుపరి వారి పనితీరు ఆధారంగా మరికొంత కాలం బ్రాండ్ అంబాసిడర్ గా పొడిగించే అవకాశం.
అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా ఎన్నికైన వీరి పనితీరు ఎలా ఉండాలి..?
అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు కార్యాచరణ చేపట్టాలి.
ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్టు, స్మార్ట్ సిటీగా అమరావతి, దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలి.
విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయటంతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలి.
దీనికోసం ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్సులు, వర్క్ షాపులు నిర్వహించాలి.తద్వారా భాగస్వాములను, పెట్టుబడిదారులను ఆకర్షించాలి.
ఈ విధంగా ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొనగా… ఏలూరు జిల్లా ముదినేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే వైద్య విద్యార్థిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి అమరావతి నిర్మాణానికి “100 కోట్లు విరాళాలు సేకరిస్తానని” ప్రకటించడం పాఠకులకు తెలిసిందే…

అంబుల వైష్ణవి అనే నేను..!!
ఆంధ్రుల ఆడపడుచుగా…
అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా…
చంద్రబాబు స్ఫూర్తిగా…
ఆనాడు అమరావతి నిర్మాణానికి చంద్రబాబు జోలి పట్టగా…
నేడు – అమరావతి పునర్నిర్మాణానికి నేను సైతం 100 కోట్ల రూపాయల నిధులు సేకరిస్తానంటున్న అంబుల వైష్ణవి..
భగవంతుని దయవల్ల రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పరిశ్రమలు రావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలని, అమరావతి త్వరితగతిన నిర్మాణం రూపుదిద్దుకోవాలని ఎన్నో మార్లు అంబుల వైష్ణవి పత్రికా ప్రకటనల ద్వారానూ , బహిరంగంగాను ప్రకటించడమే కాకుండా.. తన వంతు సాయంగా ఎకరంన్నర పొలం అమ్మి, తన తండ్రి డాక్టర్ మనోజ్ సహకారంతో.. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు మేర విరాళంగా అందించారు.

తన తండ్రి డాక్టర్ మనోజ్ బాల్యం నుండి వైష్ణవికి సేవా దృక్పథం, ఎంతో మందికి పేదరికం వల్ల గానీ, అనారోగ్యం వల్ల చనిపోయినా.. ఫైర్ ఆక్సిడెంట్ వల్ల గానీ, అవసరతలో ఎవరైనా ఉంటే.. తక్షణమే స్పందించి ఆపన్నులకు వేలల్లో నగదు సహాయం చేసి నిత్యాసర సరుకులు అందించి, కష్టకాలంలో వారిని కుటుంబాన్ని ఓదార్చి, నేటికీ ఆదర్శంగా తండ్రి – కుమార్తె నిలబడటమే కాకుండా.. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికొరకు విద్యార్థి దశలోనే వినూత్నంగా ఆలోచించి తాను విరాళాలు ఇవ్వడమే కాకుండా..

విరాళాలు సేకరిస్తానని చెప్పి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచి … కులమతాలకు అతీతంగా చిన్న, పెద్ద మధ్యతరగతి, సంపన్నులు, రైతులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు, ఎన్నారైలు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు, పొరుగు రాష్ట్రాల్లో ఉండేవారూ..

ప్రతి ఒక్కరూ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని, చేయాలని తపనతోను, దృఢ సంకల్పంతోనూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనీకతకు , విజనరీ మైండ్ కలిగిన ఏకైక నాయకుడు, వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కు ఊపిరి పోసి, నా ఇటుక – నా అమరావతి అంటూ.. ప్రజలను జోలి పట్టి అభ్యర్థించిన చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళదామని… అందుకు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనం చేస్తూ… వినమ్రతతో… అంబుల వైష్ణవి (వైద్య విద్యార్థిని) తెలిపారు.

రాష్ట్ర సుభిక్షానికై యాగం…
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ ఏడాదిలో రాజశ్యామల యాగం హోమం చేయబోతున్నానని.. తన ఇంటి వద్ద జరగబోయే హోమం కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించాలని.. ముఖ్యమంత్రి దంపతులు హోమం కు వచ్చి తనను ఆశీర్వదిస్తారని “ది డెస్క్” ప్రతినిధికి తెలిపారు.
✍️✍️ WRITTEN BY …
THE DESK – EDITOR
VISWANATH
www.thedesknews.net