The Desk… Amaravati : మంత్రి నాదెండ్ల మనోహర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపి జేఏసీ నాయకులు

The Desk… Amaravati : మంత్రి నాదెండ్ల మనోహర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏపి జేఏసీ నాయకులు

గుంటూరు జిల్లా : అమరావతి : THE DESK NEWS :

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏపీ జేఏసీ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పుష్పగుచ్ఛం మరియు నూతన సంవత్సర డైరీని అందజేసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సచివాలయం రెండో బ్లాక్ మొదటి ఫ్లోర్‌లోని మంత్రి ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఎంప్లాయీస్ యూనియన్, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్, పోలీసు అధికారులు, వీఆర్ఏ-వీఆర్వో యూనియన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ యూనియన్ మరియు ఔట్సోర్సింగ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మంత్రితో వివిధ సమస్యలపై చర్చించి, ఆయా సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.