అమరావతి : THE DESK :
అన్నం పెట్టే రైతన్నకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తోందని.. ఆరుగాలం కష్టించి పండించే పంటను రికార్డు స్థాయిలో రైతుల నుంచి సేకరిస్తోందని.. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఓ పేర్కొన్నారు.
నిన్నటి వరకు రూ. 2,584.62 కోట్లతో 1,61,568 మంది రైతన్నల నుంచి 11,22,699 మెట్రిక్ టన్నులు సేకరించగా నేడు రూ. 2,678.63 కోట్లతో 1,67,299 మంది రైతుల నుంచి 11,63,510 మెట్రిక్ టన్నులు సేకరించింది.
అంటే రూ.94.01 కోట్లతో 5,731 మంది రైతు సోదరుల నుంచి 40,811 మెట్రిక్ టన్నులు సేకరించారు. సేకరించిన ధాన్యానికి కేవలం 48 గంటల్లోనే వారి ఖాతాల్లో జమచేయడం రైతు పక్షపాతి ప్రభుత్వంగా నిలిచిపోయింది.