The Desk…Amaravati : అందరి ఆరోగ్యం-కూటమి ప్రభుత్వ లక్ష్యం

The Desk…Amaravati : అందరి ఆరోగ్యం-కూటమి ప్రభుత్వ లక్ష్యం

  • 13,40,418 రూపాయల సీఎంఆర్ చెక్కులను బాధితులకు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి : THE DESK :

తెనాలి నియోజవర్గానికి చెందిన 7 గురు బాధితులకు ఆహారం పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో తన చాంబర్ నందు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.

ఏడు గురికి 13 లక్షల 40 వేల 418 రూపాయల సీఎం సహాయ నిధి (CM RELIEF FUND) చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.

ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సహాయార్థం సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహృదయంతో బాధితుల కోసం సహాయ నిధిని విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం ద్వారా 7 గురి జీవితాలు నిలబడతాయన్నారు.