The Desk… Amaravati : అన్నక్యాంటీన్ కు విరాళాలిచ్చేవారి కోసం SBI బ్యాంక్ ఖాతా

The Desk… Amaravati : అన్నక్యాంటీన్ కు విరాళాలిచ్చేవారి కోసం SBI బ్యాంక్ ఖాతా

అమరావతి :THE DESK NEWS : అన్న క్యాంటీన్కు విరాళాలు ఇచ్చేందుకు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో పున: ప్రారంభమైన అన్న క్యాంటీన్ ల విషయంలో విశేష స్పందన వస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 203 అన్న క్యాంటీన్ లు ప్రారంభించబోతోంది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గురువారం గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా 99 చోట్ల అన్న క్యాంటీన్ లు పార్రంభించనున్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సెప్టెంబరు చివరి నాటికి మొత్తం 203 అన్న క్యాంటీన్ లు ప్రారంభించేలా ప్రభుత్వం పనులు చేపట్టింది. అన్న క్యాంటీన్ పున: ప్రారంభంపై మంచి స్పందన వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. సాధారణ ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్న క్యాంటీన్ లకు విరాళాలు ఇస్తున్నారు. బుధవారం ఒక్కరోజే రూ.2 కోట్లకు పైగా విరాళం ప్రభుత్వానికి అందింది. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అన్న క్యాంటీన్ ల నిర్వహణ చూస్తన్న మునిసిపల్ శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్ వివరాలు ప్రకటించింది.విరాళాలు పంపించాలనుకునేవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఖాతాకు నేరుగా ఆన్లైన్ విధానంలో లేదా చెక్ రాసి పంపవచ్చు.

Name:- ANNA CANTEENSA/C.no.37818165097Branch:- SBI,CHANDRMOULI NAGAR, GUNTURIFSC : SBIN0020541ఈ అకౌంట్ కు విరాళాలు పంపవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

గుడివాడలో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఈ వివరాలు ప్రకటించారు. ప్రజల భాగ్వస్వామ్యంతో ఒక స్ఫూర్తి నింపేలా అన్న క్యాంటీన్ ల నిర్వహణ ఉంటుందని సీఎం అన్నారు.

www.thedesknews.net