🔴 అమరావతి : ది డెస్క్ :

రాజధాని తుళ్లూరు సి ఆర్ డి ఏ కార్యాలయంలో గ్రీన్ అంబాసిడర్స్ కు మరియు కార్యాలయ సిబ్బందికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్ తండ్రి డాక్టర్ మనోజ్ పాదపూజ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమరావతికి జీవం పోద్దాం.. 116/- రూపాయలు సాయం చేద్దాం.. అనే కార్యక్రమం నిర్వహించగా.. కార్యాలయ సిబ్బంది మరియు గ్రీన్ అంబాసిడర్స్ అమరావతి నిర్మాణంలో.. పాలిభాగస్తులగుటకై సి ఆర్ డి ఐ అకౌంట్ కు క్యూ ఆర్ కోడ్ ద్వారా స్వతహాగా నగదు బదిలీ చేశారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ బొర్ర శ్రీనివాసరావు మరియు గుడివాడకు చెందిన రెడ్డి బంగారయ్య AGP పలువురు పాల్గొన్నారు.

