The Desk … Aalamuru : సర్వసభ్య సమావేశంలో అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన గారపాటి

The Desk … Aalamuru : సర్వసభ్య సమావేశంలో అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన గారపాటి

24 గంటల్లోపు సమస్య పరిష్కరించాలని అధికారులను హెచ్చరించిన గారపాటి

ఆగమేఘాలపై పరుగులు తీసిన పంచాయతీ సిబ్బంది

నాలుగైదు గంటలలోపే సమస్య పరిష్కారం

పంటకాలువలోనికి మురుగునీటి చెత్త కలవకుండా మెస్ ఏర్పాటు చేసిన పంచాయతీ సిబ్బంది.

గారపాటిని అభినందించిన రైతులు

కోనసీమ జిల్లా : ఆలమూరు మండలం : ఆలమూరు : ది డెస్క్ :

పంట కాలువలోకి మురుగు కాలువ నీరు రావడంతోపాటు డ్రైన్లోని చెత్త వచ్చేయడంతో పంటకాలువ నీరు దిగువకు వెళ్లక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం షరా మామూలుగా మారింది. ఆలమూరు లాకుల వద్ద నుంచి ఆలమూరు మీదుగా చింతలూరు, సంధిపూడి, వెదురుమూడి గ్రామాల ఆయకట్టుకు వెళ్లే పంటకాలువలోనికి ఆలమూరు పంచాయతీ మురుగు కాలువ నీటితోపాటు, చెత్తకూడా వచ్చేయడంతో పంటకాలువ మూసుకుపోతుందని చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాసరావు పలుమార్లు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఆయన విజ్ఞాపనను వారెవరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఆయన గట్టిగా ప్రస్తావించారు. మురుగు నీటితోపాటు, చెత్తా చెదారం వచ్చేయడంతో పంటకాలువ మూసుకుపోతుందని వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో పంటకాలువలోనికి చెత్త వెళ్లకుండా మెస్ తయారు చేయించి శుక్రవారం సాయంత్రం పంచాయతీ సిబ్బంది మెస్ ఏర్పాటు చేశారు.

చెత్తాచెదారం పంట కాలవలోకి చేరకుండా సమస్య పరిష్కారానికి కృషిచేసిన నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాసరావును పలువురు రైతులు అభినందించారు.