- రైతులు సహకారంతో కాలువ ప్రక్షాళన పనులు మొదలుపెట్టిన చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి
🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు : ది డెస్క్ :

వచ్చే రబీ సాగుకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంలో భాగంగా కాలువల తవ్వకాలు మొదలుపెట్టినట్టు చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. ఆలమూరు నుంచి వెదురు మూడి వరకు వెళ్లే పంట కాలువకు సాగు నీరు అందించే కాలువ ఇటీవల మూసుకు పోయి దిగువ ప్రాంతాలకు సాగునీరు వెళ్లక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ఈ కాలువ ద్వారా ఆలమూరు, చింతలూరు, సంధిపూడి, పినపళ్ల, అంగర, వెదురుమూడి పంట భూములకు సాగునీరు సరఫరా అవుతుందన్నారు. ఆలమూరు నుంచి ప్రోక్లైన్ తో పనులు మొదలు పెట్టామని పంట కాలువలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.
నిధులు కొరత :
గత దశాబ్ద కాలం నుండి నిధులు లేక , అధికారులు నిధులు విడుదల చేయక నానాఅవస్థలు పడుతున్న రైతులను చూసి చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి తన సొంత నిధులతో దాదాపు ఇప్పటివరకు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగుకుండా నిధులు మంజూరు చేయాలని నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి విజ్ఞప్తి చేశారు.
Chintaluru Water Association Begins Canal Cleaning for Smooth Rabi Irrigation in KONASEEMA
The Chintaluru Water Association, under the leadership of President Garapati Srinivas Chowdari, has initiated canal cleaning work to ensure uninterrupted irrigation water supply for the upcoming Rabi season. A key canal supplying water from Alamuru to Veduru Moodi had recently become blocked, disrupting water flow to farmlands in Alamuru, Chintaluru, Sandhipudi, Pinapalli, Angara, and Vedurumoodi villages. Srinivas Rao confirmed that excavation has started from Alamuru using a pro-cline machine to restore the canal’s capacity.
Highlighting a decade-long funding shortage, Srinivas Chowdari revealed he personally spent nearly Rs 5 lakh to support farmers amid government delays. He urged authorities to release funds promptly to prevent further hardships for cultivators during the Rabi season.

