The Desk…Aalamuru : రబీ సాగుకు ఇబ్బందులు లేకుండా సాగునీరు

The Desk…Aalamuru : రబీ సాగుకు ఇబ్బందులు లేకుండా సాగునీరు

🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు : ది డెస్క్ :

వచ్చే రబీ సాగుకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడంలో భాగంగా కాలువల తవ్వకాలు మొదలుపెట్టినట్టు చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు.

ఆలమూరు నుంచి వెదురు మూడి వరకు వెళ్లే పంట కాలువకు సాగు నీరు అందించే కాలువ ఇటీవల మూసుకు పోయి దిగువ ప్రాంతాలకు సాగునీరు వెళ్లక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కాలువ ద్వారా ఆలమూరు, చింతలూరు, సంధిపూడి, పినపళ్ల, అంగర, వెదురుమూడి పంట భూములకు సాగునీరు సరఫరా అవుతుందన్నారు.

ఆలమూరు నుంచి ఎక్స్కవేటర్తో పనులు మొదలు పెట్టామని పంట కాలువలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రైతులు కాలువను ఎప్పటికప్పుడు బాగు చేయించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.