🔴 ఏలూరు జిల్లా : మండవల్లి : కానుకొల్లు పంచాయతీ : ది డెస్క్ :

మండలంలోని కానుకొల్లు గ్రామ పంచాయతీ పరిధిలో “స్వచ్ఛఆంధ్ర – స్వచ్ఛదివస్” కార్యక్రమం గ్రామ సర్పంచ్ నాగదాసి థామస్, పంచాయతీ కార్యదర్శి కొండలు ఆధ్వర్యంలో శనివారం జరిగింది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛఆంధ్ర – స్వచ్ఛదివస్ కార్యక్రమంలో భాగంగా… కానుకొల్లులో…సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొరకు గ్రామసభ నిర్వహించి.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణకు గ్రామంలో విద్యార్థులు, గ్రామస్తులతో కానుకోల్లు పంచాయతీ సిబ్బంది ప్రతిజ్ఞ చేయించారు.

అదేవిధంగా గ్రామంలో పలు షాపులకు వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని క్రమేపి తగ్గించాలని వివరిస్తూ అవగాహన కల్పించారు. గ్రామ పరిధిలోని షాప్ యాజమానులకు, గ్రామస్తులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ, తడి-పొడి చెత్త నిర్వహణపై అవగాహన కొరకు కరపత్రాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కానుకొల్లు పంచాయతీ కార్యదర్శి కొండలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.