The Desk… : Collectorate  : వాహనదారులు రహదారి నియమాలు విధిగా పాటించాలి : జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు.

The Desk… : Collectorate : వాహనదారులు రహదారి నియమాలు విధిగా పాటించాలి : జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు.

  • జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాతీయ రహదారులు భద్రత మాసోత్సవాలు.
  • హెల్మెట్ ధారణ పై అవగాహనా కల్పించడం కోసం ప్రత్యేక ప్రచారం చేపట్టాలి.

తూ. గో జిల్లా : THE DESK NEWS :

రహదారులపై ప్రయాణం చేసే క్రమంలో భద్రతకు ప్రాధాన్యతా ఇవ్వాలని, ఆమేరకు రవాణా వ్యవస్థ లో ఉన్న అందరికి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో "జాతీయ రహదారులు భద్రత మాసోత్సవాలు - 2025" గొడప్రతులని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తదితరులతో కలిసి జెసి ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ.. రహదారులపై ప్రయాణం చేసే ప్రతీఒక్కరికీ రహదారుల భద్రత పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం ద్వారా చైతన్యం తీసుకుని రావాలని సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు నేపధ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో జనవరి 16 వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు భధ్రత పై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగు తోందన్నారు. 

ముఖ్యంగా వాహనాలు నడిపే వారికీ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లు కు ట్రాఫిక్ నియమావళి , జాతీయ రహదారులు పై వాహనాలు నడిపే క్రమంలో తీసుకోవలసిన జాగ్రత్తలు పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. హెల్మెట్ ధారణ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను చేపట్టాలన్నారు. యువతకు, ఆటో డ్రైవర్లు కు, మహిళలకి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రహదారుల భధ్రత పై కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చైతన్యం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా రవాణ అధికారి ఆర్. సురేష్ వివరాలు తెలియ చేస్తూ... చోదకులకు, యువతకు  , ఆటో డ్రైవర్లు కు ట్రాఫిక్ నియమావళి పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 మండలాల్లో, 3 నగర పాలక, పురపాలక సంఘాల సంస్ధ పరిథిలో ప్రజా ప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం తో నెల రోజుల పాటు జాతీయ రహదారులు భద్రత మాసోత్సవాలను జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. చోధకులకి అవగాహన కల్పించడం, ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు, భారీ వాహనాలను నడిపే వారికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు సీహెచ్..సంపత కుమార్, జిడి రామనారాయణ, ఎం.రవి కుమార్ ,  అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు శ్రీమతి చహిత్య సుమ, సాయి , కానిస్టేబుల్స్ & హోమ్ గార్డులు  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్, మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్లు: CH సంపత కుమార్, జిడి రామనారాయణ, ఎం.రవి కుమార్ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు శ్రీమతి చైతన్య త్య సుమ,సాయి,  కానిస్టేబుల్స్ & హోమ్ గార్డులు పాల్గొంటున్నారు.