ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో జిల్లా విద్యార్థులకు విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆరు నుంచి పదో తరగతి వరకు, ఒక్కో తరగతికి 50 మంది చొప్పున 250 మందికి చదువుకునే అవకాశం లభిస్తుందని ఎంపీ తెలిపారు. తన విజ్ఞప్తిని మన్నించి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఎంపీ స్పష్టం చేశారు.