ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK :
ఏ.పి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు శనివారం జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో లైన్స్ క్లబ్ హాల్ లో జరిగే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఏలూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని ఏపి. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
జంగారెడ్డిగూడెంలో జరగనున్న మున్సిపల్ వర్కర్స్ జనరల్ బాడీ సన్నాహక సమావేశం స్థానిక ఏలూరు జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలో… భజంత్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ… సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎఐటియుసి ఏలూరు జిల్లా ఇన్చార్జి చలసాని రామారావు,యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ.రంగనాయకులు, ప్రధాన కార్యదర్శి పి. సుబ్బారాయుడు, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ శ్రీనివాస డాంగే,కె బుచ్చిబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే. విగ్నేష్, కార్యనిర్వాహక అధ్యక్షులు టి. బాబు,సి.పి.ఐ మండలం కార్యదర్శి జె.వి.రమణ రాజు, ఏఐటియుసి ఏలూరు జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు,జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి కుంచెవసంతరావు తదితరులు పాల్గొంటారని తెలిపారు.
ఏలూరు నగర కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం,మున్సిపాలిటీ చింతలపూడి నగర పంచాయతీలో గల మున్సిపల్ కార్మికులు సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కసింకోట నాగేంద్ర,యల గాడ దుర్గారావు, శివ కుమార్, బంగారు మధు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.