🔴 విజయవాడ / శ్రీశైలం :THE DESK NEWS :
మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సీ ప్లేన్ చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, టూరిజం, ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ నెల 9న పున్నమిఘాట్లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు.
డీ హవిల్లాండ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది.
www.thedesknews.net