The Desk…చదరంగంలో వరల్డ్ రికార్డ్ సృష్టించిన నారా దేవాన్ష్… తండ్రిగా మురిసిన మంత్రి లోకేష్

The Desk…చదరంగంలో వరల్డ్ రికార్డ్ సృష్టించిన నారా దేవాన్ష్… తండ్రిగా మురిసిన మంత్రి లోకేష్

🔴 అంతర్జాతీయo : లండన్ : ది డెస్క్ :

వేగవంతమైన చెక్ మేట్ సాల్వర్ – 175 పజిల్స్ సాధించి నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ అందుకున్నారు. ఈ మేరకు లండన్లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుల వేడుకలో దేవాన్ష్ కు నిర్వాహకులు అవార్డును ప్రదానం చేశారు.

గతేడాది చెక్ మాట్ మారథాన్లో 175 చెక్మేట్ సవాళ్లను పరిష్కరించి దేవాన్ష్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. చెస్ డొమైన్ లో గతంలోనూ మరో రెండు రికార్డులు సాధించారు. దేవాన్ష్ సాధించిన ఈ ఘనత ఎంతో గర్వకారణమని అతడి తండ్రి, ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

10 ఏళ్ల వయసులోనే ఆలోచనలకు పదును పెడుతూ, ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ అంకిత భావంతో దేవాన్ష్ చెస్ నేర్చుకున్నాడని చెప్పారు. అతడి కష్టాన్ని, గంటల తరబడి కఠోర శ్రమను తండ్రిగా ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసి ఎంతో ఆనందిస్తున్నాని చెప్పారు.