🔴 దిల్లీ/ ఏలూరు : ది డెస్క్ :.
గోవా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి దిల్లీ పర్యటనలో ఉన్న అశోక్ గజపతిరాజును న్యూఢిల్లీలోని నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు నివాసంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
అశోక్ గజపతి రాజుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పుష్పగుచ్చాలు అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం జ్ఞాపిక బహుకరించి అశోక్ గజపతిరాజు ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో సహచర ఎంపీలు పాల్గొన్నారు.