🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్:
రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల రూపురేఖలు మారాయని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్ లోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం జిల్లాస్థాయి అధికారులతో ఎంపీ మహేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన రహదారులకు అవసరమైన నిధుల మంజూరు నిమిత్తం అంచనాల రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనల నివేదిక సమర్పించాలని ఎంపీ మహేష్ కుమార్ అధికారులకు సూచించారు. రహదారుల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంలో సమర్థవంతంగా ఆర్ అండ్ బి శాఖ అధికారులు పనిచేశారని ఎంపీ మహేష్ కుమార్ అభినందించారు. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు అధికారులు సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ మహేష్ కుమార్ సీడాప్ అధికారులకు సూచించారు. అధికారులు సమర్థవంతంగా పనిచేస్తేనే తనతో పాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎంపీ తెలిపారు. జిల్లాలోని కొన్ని శాఖల అధికారులు తమ పద్ధతి మార్చుకోవడం లేదని, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీ మహేష్ కుమార్ హెచ్చరించారు.
అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఎంపీ మహేష్ కుమార్ ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కొయ్యలగూడెం తహసిల్దార్ సక్రమంగా పనిచేయడం లేదని, పని నిమిత్తం వెళ్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని పలు రైతులు ఎంపీ మహేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సదరు తహసిల్దార్ సక్రమంగా పనిచేయకపోతే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఎంపీ మహేష్ కుమార్ హెచ్చరించారు.
సమీక్ష సమావేశానికి ఆర్ అండ్ బి డిప్యూటీ ఈఈలు ఎం.గోవింద మోహన్, సిహెచ్. విజయ్ శేఖర్, ఈఈ వై.వి కిషోర్ బాబుజి, ఎస్.ఈ పి. భరతరత్నం, పంచాయతీరాజ్ ఎస్.ఈ ఎంవి రమణమూర్తి,, నీటి యజమాన్య సంస్థ జిల్లా పిడి కే.వెంకట సుబ్బారావు, భూగర్భ జలశాఖ ఇన్చార్జి డిడి సిహెచ్.వెంకటరావు, సీడాప్ జేడీఎం కె. పార్థసారథి, ఏపీఎస్ఎస్డిసి డీఎస్డీవో ఎన్.జితేంద్ర, తదితరులు పాల్గొన్నారు.