ఢిల్లీ : ది డెస్క్ :
బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్…

బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారు. వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం.. అమ్మే బియ్యం లో నాణ్యత లేదు.

26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉంది. వేయింగ్ మిషన్ సైతం సరిగా పనిచేయడం లేదు.
26 కేజీల బియ్యం బస్తాను చెక్ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించిన మంత్రి
నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం..
నాణ్యమైన బియ్యంతో పాటు, సరుకులను అందిస్తాం..

– ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్