ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK : రాష్ట్ర మంత్రి కె.పార్ధసారధి, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి చేతులు మీదుగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఏలూరు జిల్లా ఉత్తమ జిల్లా అధికారిగా పురస్కారాన్ని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అందుకున్నారు . ఈ సందర్బంగా జిల్లాకు, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ డిజిపిఓ యూనిటుకు, ఉత్తమ సేవలు అందించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ముఖ్యంగా పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి డైరెక్టర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఉత్తమ సేవ పురాష్కారానికి ప్రతిపాదించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి డిపిఓ ధన్యవాదాలు తెలిపారు.
