ఏలూరుజిల్లా, కైకలూరు, ద డెస్క్ : నియోజకవర్గం కేంద్రం కైకలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ బుధవారం 36వ రోజుకు చేరింది. అన్నదాతగా బుజాలపట్నం గ్రామానికి చెందిన ఇందుకూరి బాలకృష్ణ. శ్రీమతి సునీత దంపతుల ఆర్థిక సాయంతో సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా చలమయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన కొల్లి వరప్రసాద్ (బాబీ), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి లు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్. కామినేని శ్రీనివాస్ ఆదేశాలు మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 36 రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దాతలు ఇందుకూరి బాలకృష్ణ, సునీత దంపతులు సహకారంతో నేడు అన్న క్యాంటీన్ ను నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని.. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అధికారికంగా ప్రారంభించేంతవరకు కొనసాగిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో గంగునేని వరప్రసాద్, తులసి పూర్ణ, పుప్పాల సూర్యప్రకాష్, అద్దంకి రమేష్ రాజు, బొక్క వెంకటరావు, రామాయణం కొండలరావు తదితరులు పాల్గొన్నారు.