The Desk…Kaikaluru : ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎన్ఆర్ కు నేతల అభినందనలు

The Desk…Kaikaluru : ఏలూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎన్ఆర్ కు నేతల అభినందనలు

ఏలూరు జిల్లా : కైకలూరు : THE DESK : కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, ఏలూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డిఎన్ఆర్) ను మండలంలోని భుజబలపట్నం, పల్లెవాడ గ్రామాలకు చెందిన పలువురు నేతలు సోమవారం సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల వైకాపా అధినేత వైయస్ జగన్ డిఎన్ఆర్ ను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా నియమించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో మండలానికి చెందిన నాయకులు మండల కో ఆప్షన్ సభ్యుడు సోమల శ్యామ్ సుందర్, పల్లెవాడ మాజీ ఎంపీటీసీ బంటుపల్లి సాదు కొండయ్య, ఏఏంసి వైస్ చైర్మన్ ఉచ్చుల చినరాజు, మాజీ ఆర్బికే డైరెక్టర్ దాసరి శ్యాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గుజ్జుల యాకోబు, జంగం మధుసూదనరావు, అంబేద్కర్, తదితరులు డిఎన్ఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేశారు.