ఏలూరు జిల్లా : ఏలూరు: THE DESK : పారిశుద్ధ్య నిర్వహణలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. మురుగు కాలువలు, తాగు నీరు ట్యాంకుల శుభ్రం, ప్రజలకు రక్షిత తాగునీటి సరఫరా, పంచాయతీ చెరువుల్లో గుర్రపు డెక్క, గ్రామాల్లో చెత్త కుప్పల తొలగింపు తదితరాల పర్యవేక్షణకు ప్రభుత్వం పీఆర్ వన్ యాప్ అమలు చేసింద న్నారు. గ్రామస్థాయిలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు. తద్వారా ఈజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కైవసం చేసుకుందని DPO తెలిపారు.
