కృష్ణా జిల్లా, ఘంటసాల : The Desk : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్తు వినియోగదారులకు ఘంటసాల మండల విద్యుత్ శాఖ ఏఈ పి.రవి కుమార్ పలు సూచనలు చేశారు.
ఈ సంద్భంగా ఏఈ మాట్లాడుతూ..
ఇళ్ళు, పొలాల్లో కరెంట్ మోటార్లు, స్టార్టర్స్, డబ్బాలు తడిచి వుంటాయని తద్వారా విద్యుత్తు షాక్ గురయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు పొలాల్లో కరెంట్ మోటార్లు, స్టార్టర్స్ వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గాలులకు సర్వీసెస్ వైర్లు డామేజ్ అవుతాయని, స్తంభాలు పడిపోయి తీగలు తెగి ప్రమాదకర పరిస్థితి ఉంటుందన్నారు.
ఆక్వా రైతులు ఏరియేటర్లను తాకరాదన్నారు.
ఇళ్లలో సర్వీస్ వైర్లను, వాటి పక్కన వేలాడే ఇనుప తీగలను కానీ, కరెంట్ స్తంభాలను కానీ, ఇనుప స్తంభాలను కానీ, లైన్ల మీద చెట్టు కొమ్మలు పడినా కానీ వాటినితాకే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు, వాహనాలపై వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.
రోడ్లపై, కాలువగట్ల డొంకలలో పోల్స్ వైర్లు తెగి ఉండవచ్చని అప్రమత్తంగా ఉండాలని కోరారు. తడిచేతులతో ఇంట్లోని స్విచ్ బోర్డులను తాకవద్దన్నారు. విద్యుత్ షాకుతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దయచేసి విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఎక్కడైనా, ఏదైనా విద్యుత్ సమస్య వుంటే, తీగలు తెగి ఉన్న పోల్స్ పడిపోతే వెంటనే మీ లోకల్ లైన్ ఇన్స్పెక్టర్స్, లైన్ మెన్, సబ్ స్టేషన్లకు కానీ, తమ దృష్టికి కానీ, 1912కు కానీ తెలియచేయాలని సూచించారు.