ఏలూరు జిల్లా : ఏలూరు : The Desk : ఏలూరు జలవనరుల శాఖ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో,, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు మేరకు రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో… శుక్రవారం “వన మహోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SI సబ్ డివిజన్ డీఈఈ బొట్టా శ్రీనివాస్… డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గాజులేటి రాజు..AEE పంజా కిషోర్ ..టెక్నికల్ ఆఫీసర్ వేగేశ్న వెంకటపతి రాజు, జలవనరుల శాఖ ఉద్యోగులు తదితరులు వన మహోత్సవంలో పాల్గొన్నారు.
