ఏలూరు జిల్లా : ముదినేపల్లి : THE DESK : మండలంలోని సంఘర్షణపురంకు చెందిన కరవల్లి సంధ్య (14) అనే బాలిక బ్రెయిన్ కేన్సర్తో బాధపడుతూ శుక్రవారం ఉదయం మృతి చెందింది. ఈ మేరకు సమాచారం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిండర్ అంబుల వైష్ణవి తన తండ్రి డా. మనోజ్ ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించింది. డా. మనోజ్ బాధితుల ఇంటికి వెళల్లి సంధ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి తమవంతు బాధ్యతగా రూ.5 వేలు నగదు సహాయం చేశారు.
