ఏలూరు జిల్లా, కలిదిండి (ద డెస్క్ న్యూస్) : స్థానిక ఆంధ్ర, తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బుజ్జి ఆధ్వర్యంలో గురువారం ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్, పద్మవిభూషణ్ డా. కొణిదల చిరంజీవి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకకు ముఖ్య అతిథిగా కైకలూరు శాసనసభ్యులు డా. కామినేని పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో NDA నాయకులు, రాధా -రంగా మిత్ర మండలి అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి), చిట్టూరి రావేంద్ర, నల్లగొపుల చలపతి, జనసేన కలిదిండి మండలం అధ్యక్షులు బెల్లంకొండ వెంకన్నబాబు, కైకలూరు మండలం అధ్యక్షులు ముమ్మారెడ్డి నాగమలేశ్వరరావు, లంక రతయ్య చిట్టూరి సురేష్, పన్నాస కృష్ణ, అయ్యప్ప, ఉద్ద ర్రాజు సుభాషిణి, కొల్లి బాబీ, నల్లజర్ల సత్యనారాయణ, కట్ట పండు, ప్రసాద్ రాజు, రామాంజనేయులు, చిరంజీవి యువత అధ్యక్షులు జడ్డు సుబ్రహ్మణ్యం, చిన్న, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
