ఏలూరు జిల్లా : దెందులూరు :THE DESK : విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ విశ్వనాథ్ హెచ్చరించారు. దెందులూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. హాజరు నమోదులో సమయ పాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయాల సిబ్బంది తొమ్మిది మందికి ఎంపీడీవో శ్రీలత షోకాజు నోటీసులు జారీ చేశారు. శ్రీరామవరం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీసు, చల్లచింతలపూడి డిజిటల్ అసిస్టెంట్, దెందులూరు డిజిటల్ అసిస్టెంట్, వ్యవసాయ, ఉద్యాన శాఖల సహాయ కులు, రామారావుగూడెం డిజిటల్ అసిస్టెంట్, గాలాయ గూడెం ఇంజినీరింగ్ అసిస్టెంట్, మేదినరావుపాలెం ఏఎన్ఎం లకు నోటీసులు ఇచ్చారు.
ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ…
వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన దేశం, రాష్ట్రం ముందుకు సాగుతోందన్నారు. ఆ దిశగా సచివాలయ సిబ్బ౦ది ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు.