The Desk…Narasapuram : రాధా – రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రారంభోత్సవం కు “కొత్తపల్లికి” ఆహ్వానం

The Desk…Narasapuram : రాధా – రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ప్రారంభోత్సవం కు “కొత్తపల్లికి” ఆహ్వానం

ప.గో జిల్లా, నరసాపురం/కైకలూరు (ద డెస్క్ న్యూస్) : ఏలూరు జిల్లా, కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మండలంలో త్వరలో ప్రారంభించబోతున్న ఆంధ్ర, తెలంగాణ రాధా – రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ జిల్లా స్థాయి కార్యాలయ ప్రారంభోత్సవానికి మాజీ మంత్రి, జనసేన నాయకులు కొత్తపల్లి సుబ్బారాయుడు ను హాజరుకావాలని మిత్రమండలి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి) కోరారు. శుక్రవారం నరసాపురం నియోజకవర్గం మిత్రమండలి అధ్యక్షులు బండారు రాజేంద్రతో కలిసి బుజ్జి కొత్తపల్లి ని ఆయన నివాసంలో కలిసి ప్రారంభోత్సవానికి రావాలని కోరగా.. తప్పక హాజరవుతానని చెప్పినట్లు బుజ్జి తెలిపారు. అనంతరం కాళ్లపాలెం బుజ్జి తదితరులు కొత్తపల్లి సుబ్బారాయుడును పూలమాలవేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువత గొల్లగూడెం సభ్యులు కూరేళ్ల కళ్యాణ్, టేకు పూడి బంటి, కోలా లలిత్ తదితరులు పాల్గొన్నారు.