The Desk… Eluru : కార్పొరేట్ల అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయాలి : కొల్లూరు సుధారాణి

The Desk… Eluru : కార్పొరేట్ల అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయాలి : కొల్లూరు సుధారాణి

ఏలూరు జిల్లా : ఏలూరు :THE DESK NEWS : కార్పొరేట్ల అనుకూల విధానాలపై మరో స్వాతంత్ర పోరాటం చేయాలని సిపిఐ ఏలూరు ఏరియా కార్యవర్గ సభ్యురాలు కొల్లూరు సుధారాణి పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా 16వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి పాల్గొన్న సుధారాణి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశ సంపదను కార్పొరేట్ల పరం చేస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. దేశంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందించడానికి కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వాలపై స్వాతంత్ర్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉప్పులూరి రవి, జిజ్జువరపు సురేంద్ర, లక్ష్మి,భవాని, నిస్సీ, ఏ.రవి, శిరీష, తదితరులు పాల్గొన్నారు.