The Desk News : ఏలూరు నగరంలో భారీ ర్యాలీ… ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా

The Desk News : ఏలూరు నగరంలో భారీ ర్యాలీ… ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించేందుకు హర్ ఘర్ తిరంగా

ఏలూరు జిల్లా, ఏలూరు (ద డెస్క్ న్యూస్) : జాతీయ సమైక్యత, సమగ్రతలను చాటిచెప్పే జాతీయ జెండాను ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లపై ఎగురవేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో మంగళవారం క్రీడలు, పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి .ధాత్రిరెడ్డి తో కలిసి ప్రజలచే ‘హర్ ఘర్ తిరంగా’ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ చేయించారు. అనంతరం ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ వరకు నిర్వహించిన ర్యాలీ ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా మనం ఈ రోజు స్వేచ్చా వాయువులను పీలిస్తున్నామన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఆ అమరవీరుల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి ప్రతీ ఒక్కరూ అంకితం కావాలన్నారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తి ప్రతిబింబించే విధంగా ఎప్పుడూ మననం చేసుకుంటూ, జాతీయ జెండాను వారి ఇంటిపై ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర సంగ్రామ కాంక్షను రగిల్చిన ఆనాటి స్వాతంత్రోద్యమ ఘట్టాలను ప్రతీ ఒక్కరూ స్మరించుకుంటూ ఉండాలన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఐక్యతా భావాన్ని పెంపొందించేలా సైకిల్ మరియు బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో 125 అడుగుల పొడవు గల జాతీయ జెండా పట్టుకుని విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటారు. నగరంలోని కస్తూరిబా బాలికోన్నతపాఠశాలల,సెయింట్ థెరిస్సా కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు నగర ప్రధాన కూడళ్లలో సుమారు 800 మంది ర్యాలీ లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి డి. పుష్పమణి, ఆర్డీఓ ఎన్. ఎస్. కె. ఖాజావలి,ఎస్డీసీ లు ఎం. ముక్కంటి, కె. బాబ్జి,సెట్ వెల్ ఇంచార్జి సీఈఓ మధుభూషణరావు, జిల్లా పర్యాటక శాఖ మేనేజర్ ఎస్. పట్టాభిరామయ్య, ఐసిడిఎస్ పీడీ పద్మావతి, ఏలూరు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా. మాలతీ, జిల్లా విద్యా శాఖాధికారి అబ్రహం, ఉద్యానవనాలు శాఖ డిడి రామ్మోహనరావు, బిసి. కార్పొరేషన్ ఈడి నాగరాణి, డిఎస్డీఓ శ్రీనివాసరావు, ప్రభృతులు పాల్గొన్నారు.