- నారా లోకేష్ ఢిల్లీ పర్యటన, ఎంపీలతో భేటీ
- ఉంగుటూరు P4 ప్రజావేదిక సభపై ఆరా – కేంద్ర మంత్రులతో భేటీలు
- ఏలూరు ఎంపీకి మహేష్ కు ప్రత్యేక ప్రశంసలు
🔴 ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించి, కేంద్ర సాయాన్ని అభ్యర్ధించేందుకు ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు మంగళవారం ఉదయం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఇతర ఎంపీలు స్వాగతం పలికారు.

ఆనంతరం నారా లోకేష్ కూటమి ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్రం దృష్టికి తేవాల్సిన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సోమవారం ఉంగుటూరు మండలంలో జరిగిన P4 ప్రజావేదిక సభపై ఎంపీను ఆరా తీసిన నారా లోకేష్, మీరు బాగా పనిచేస్తున్నారని అభినందించారు.
సోమవారం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. సోమవారం ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ, ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అదేరోజు రాత్రి ఢిల్లీ చేరుకుని మంగళవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పాల్గొంటున్నారు.

