ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :

మండలంలోని సింగరాయపాలెం గ్రామం చేవూరుపాలెం సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని షష్టి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ మంగళవారం దర్శించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ.. ఎంతో వైభవోపేతంగా స్వామి ఉత్సవాలు నిర్వహించటం మిక్కిలి ఆనందయాకంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యలకు ఎటువంటి రాజి పడొద్దని.. అందరూ స్వామి వారిని దర్శించుకుని వెళ్లేలా దేవస్థానం సిబ్బంది, కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, ఆలయ సిబ్బంది, NDA నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

