- మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత
కృష్ణా జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయం : మచిలీపట్నం : ది డెస్క్ :
ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం అందించడానికి కృష్ణా జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందని ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వి .విద్యాసాగర్ నాయుడు అన్నారు.
ఈరోజు మీకోసం కార్యక్రమానికి విచ్చేసిన ఫిర్యాదుదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి సమస్యను విని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, వారి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ వి.వి. నాయుడు ప్రజల వద్ద నుండి ఫిర్యాదుల స్వీకరించారు.
ఈరోజు మీకోసం కార్యక్రమానికి 35 ఫిర్యాదులు రాగా అందులో..
⏩. అవనిగడ్డ నుండి సుందర్ అనే వ్యక్తి వచ్చి తాను కుటుంబ అవసర నిమిత్తం తన దగ్గర బంధువు వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నానని వడ్డీ కడుతున్నప్పటికీ, ఇంటి పైకి బలవంతంగా వచ్చి చెక్కులపై సంతకాలు చేయించుకొని దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
⏩. పెనమలూరు నుండి సీత అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి మూడు సంవత్సరాలు కాగా పెళ్లైన నాటి నుండే అదనపు కట్నం కోసం భర్త అత్తింటివారు వేధిస్తున్నారని, అంతేకాక పలుమార్లు చిత్రహింసలకు గురిచేసి హింసిస్తున్నారని న్యాయం చేయమని ఫిర్యాదు.
⏩. బంటుమిల్లి నుండి సాకేత్ అనే యువకుడు వచ్చి తాను పీజీ పూర్తి చేసి ఖాళీగా ఉండగా తన స్నేహితుడు ఒకరు 2 లక్షలు కడితే మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి సంవత్సరం క్రితం డబ్బు కట్టించుకున్నాడని, ఉద్యోగం గూర్చి అడిగితే ఎటువంటి సమాధానం లేకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నాడని న్యాయం చేయమని ఫిర్యాదు.

