🔴 కాకినాడ జిల్లా : అన్నవరం : ది డెస్క్ :

గత సెప్టెంబర్ 4 రాత్రి గాయత్రి కాలనీ, అన్నవరం గ్రామంలో 16 తులాలు బంగారు ఆభరణాలు మరియు 1.4 కేజీల వెండి వస్తువులు చోరీ కావడంతో..గుత్తిన పవన్ హరిప్రసాద్ సోదరి ఇంటికి పుట్టినరోజు సందర్బంగా వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఇంటికి తిరిగి వచ్చి ఈ దోపిడీని గుర్తించారు.
వెంటనే ఈ కేసు అన్నవరం పోలీస్‌స్టేషన్ లో Cr. No. 283/2025 u/s 331(4), 305(a) BNSగా నమోదు చేయబడింది.ఈ కేసు తీరును దశలవారీగా పరిశీలించి అనేక సీసీ కెమెరా ఫుటేజీలను సేకరించిన అన్వేషణా బృందం, పెద్దాపురం DSP D. శ్రీహరిరాజు ఆధ్వర్యంలో..
ప్రత్తిపాడు CI B. సూర్య అప్పారావు పర్యవేక్షణలో..
అన్నవరం SI జి శ్రీహరిబాబు మరియు సిబ్బంది సహకారంతో..
దోపిడీ నేపథ్యంలో.. స్పెషల్ టీమ్ క్రియేట్ చేశి, బాధితుడి సమాచారంతో పాటు గాయత్రి కాలనీ పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలు పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయి చినమాన ఎల్లాజీ @ రాజు(38), వాడబలిజి ఉప్పాడ గ్రామ పునాదికి చెందిన వ్యక్తిని గుర్తించి, నవంబర్ 29న అన్నవరం దేవస్థానం జూనియర్ కాలేజీ సమీపంలోని సిమెంట్ రోడ్డుప్పక్కన అరెస్టు చేసి, చోరీ అయిన మొత్తం 16 తులాలు బంగారు ఆభరణాలు, 1.4 కిలోల వెండి వస్తువులు అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.
ఈ దర్యాప్తు పనులను కాకినాడ జిల్లా SP బిందు మాధవ్ ప్రత్యేకంగా పర్యవేక్షించి , అరెస్ట్ చేసిన సిబ్బందికి, స్పెషల్ టీంకు పెద్దాపురం DSP డి. శ్రీహరిరాజు అభినందనలు తెలిపారు. ఇది దొంగతనాలపై పోలీస్ బృందం సమర్థమైన చర్యల్లో ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించే విధంగా పోలీసులు కృషిని పలువురు అభినందిస్తున్నారు.

