The Desk…Prattipadu : డకాయిటీ గ్యాంగ్ అరెస్ట్ – 11 కేజీల వెండి వస్తువులు స్వాధీనం

The Desk…Prattipadu : డకాయిటీ గ్యాంగ్ అరెస్ట్ – 11 కేజీల వెండి వస్తువులు స్వాధీనం

🔴 కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు : ది డెస్క్ :

నెల్లూరు పొలిస్ సిబ్బంది సహకారంతో కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు పోలీసులు భారీ వెండి దొంగతనాన్ని చేదించి, నిందితులను అరెస్ట్ చేసి సుమారు 11 కేజీలు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

సెప్టెంబర్ 24, 2025 అర్ధరాత్రి సమయంలో, ప్రత్తిపాడు మెయిన్ రోడ్‌లోని సురేష్ జువెలరీ షాపులో కొంతమంది అనుమానాస్పదులు షట్టర్ ను పగలగొట్టి దొంగతనం చేసినట్లు షాపు యజమాని గొంతిన సురేష్ కంప్లైంట్ ఇవ్వగా…ఘటనకు సంబంధించి క్రైం నెంబర్ 199/2025 తో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది.

కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్ ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించగా.. పెద్దాపురం డీఎస్పీ D. శ్రీహరిరాజు ఆధ్వర్యంలో.. ప్రత్తిపాడు CI B. సూర్య అప్పారావు సమన్వయంలో… స్పెషల్ టీమ్ గా ఏర్పడి నిందితులను గుర్తించి నెల్లూరు పరిధిలోని షేక్ ఫక్రుద్దీన్ బిషనై మరియు అతని స్నేహితులను అరెస్ట్ చేశారు.

మరోవైపు, ఈ దొంగతనానికి ప్రధాన నిందితుడైన షేక్ ఫక్రుద్దీన్ బిషనై ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, చోరీ చేసిన వెండి వస్తువులను తాడేపల్లిగూడెం మండలంలోని కర్రీ సాయి చంద్రారెడ్డి అనే వ్యక్తికి అమ్మడానికి ఇచ్చారు. అతనిని కూడా అరెస్ట్ చేసి, ప్రత్తిపాడు SI S. లక్ష్మీకాంతం పర్యవేక్షణలో తాడేపల్లి ప్రాంతం నుండి 11 కేజీల వెండి వస్తువులను పునఃప్రాప్తి చేయించారు.

ఈ కేసులో దక్షిణ భారతదేశం మరియు మధ్యప్రదేశ్ నుంచి పడిన డాకాయిటీ గ్యాంగ్ సభ్యులను కూడా గుర్తించి, నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక డెకాయిటీ నేరంలో కూడా వాటిని అరెస్ట్ చేస్తూ, రిమాండ్ కు పంపారు.

కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ, ప్రత్తిపాడు సీఐ, ప్రత్యేక సిబ్బంది, తణుకు పోలీసుల సహకారంతో నిందితులను అరెస్ట్ చేసి, మొత్తం దొంగతనపు సొమ్మును రికవరీ చేశారు.

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఈ సిబ్బందిని ప్రశంసిస్తూ, ప్రజలకు న్యాయం అందించడంలో మరింత కృషి చేయాలని బలపరిచారు. ఈ ఘన విజయాన్ని సాంకేతిక నైపుణ్యం, సమన్వయం, మరియు పట్టుదలతో సాధించిన ప్రత్తిపాడు పోలీసులు, ఆనాటి చోరీలను సమర్ధంగా పరిష్కరించారు.