🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
2027 చివరి నాటికి ఏలూరు పార్లమెంట్ పరిధిలో సిగ్నల్ నెట్ వర్క్ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని లక్ష్యంగా నిర్ణయించామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. 4G నెట్ వర్క్, టవర్ల సమస్యలపై ఈరోజు ఏలూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం పాల్గొన్నారు.

సమీక్షలో పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ.. 175 కొత్త టవర్ల ఏర్పాటుకు అనుమతులు వచ్చాయని, ఏడాదిలోగా సిగ్నల్ సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తూ త్వరగా టవర్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
దేశంలో ఎక్కడా నెట్ వర్క్ సమస్యలు లేకుండా టవర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ జీఎం ఎల్ శ్రీనివాస్, సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

