- వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్
- తరగతి గదుల పరిశీలన, విద్యాబోధన తీరుపై అధ్యాపకులతో చర్చ
- హాస్టల్ నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించిన ఎంపీ
- విద్యార్థినులతో కలిసి పాఠశాల క్యాంటీన్లోనే భోజనం చేసిన ఎంపీ
- ఆధ్యాపకులకు, వార్డెన్, సిబ్బందికి సూచనలు
🔴 ఏలూరు జిల్లా : ఏలూరు/ వట్లూరు : ది డెస్క్ :

వట్లూరు బాలికల గురుకుల పాఠశాలను గురువారం మధ్యాహ్నం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. భోజనశాలను తనిఖీ చేసిన ఎంపీ వసతి సౌకర్యాలు, ఆహార పదార్థాల మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఎంపీ, కాసేపు విద్యార్థినులతో ముచ్చటించారు. గురుకుల పాఠశాలను పరిశుభ్రంగా, అన్ని సౌకర్యాలతో, ఉన్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న వార్డెన్ మరియు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభినందించారు.
విద్యార్దులను ఉన్నత విద్యావంతులుగా, సత్ప్రవర్తనతో తీర్చి దిద్దాల్సిందిగా అధ్యాపకులకు సూచించిన ఎంపీ ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని వార్డెన్ కు ఇతర సిబ్బందికి హామీ ఇచ్చారు.

