కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం మంత్రి కొల్లు రవీంద్ర తోనే సాధ్యమని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ అన్నారు.
కార్తీక మాసం చివరి రోజు సందర్భంగా పరాసుపేట నందు బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించి, ప్రముఖ దేవాలయమైన వేణుగోపాల్ స్వామి గుడి చైర్మన్ గా, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నగర ఉపాధ్యక్షుడిగా నియమింపబడిన వేమూరి సాయి లను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, మచిలీపట్నం బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, ఏ ఆర్ కె మూర్తి లు వారిని అభినందించి, ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ మాట్లాడుతూ…..
మంత్రి కొల్లు రవీంద్ర తోనే బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమం సాధ్యం అనటానికి నిదర్శనం ప్రతి ఎండోమెంట్ దేవాలయంలోనూ అర్చకుడితోపాటు, ఒక బ్రాహ్మణుడిని కమిటీ లోనికి తీసుకోవడం నిదర్శనం అన్నారు. అలాగే ప్రముఖ దేవాలయమైన వేణుగోపాలస్వామి దేవస్థానానికి మచిలీపట్నంలో చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారని, మార్కెట్ యార్డులో ఒక డైరెక్టర్ పదవి ఇచ్చారని, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లో రాష్ట్ర డైరెక్టర్ పదవి తనకు ఇప్పించి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు అన్నారు.
అలాగే మచిలీపట్నం నగర తెలుగుదేశం పార్టీలో ఒక బ్రాహ్మణుడికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చి కూడా గుర్తింపు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో కుల మతాలకు అతీతంగా ఉపయోగపడే స్వతంత్ర సమరయోధులు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అందరితో కలిపి ఉద్యమం చేస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని స్పందించకపోవడం బ్రాహ్మణుల పట్ల ద్వేషానికి నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఆర్టీసీ చైర్మన్, కొనకళ్ళ నారాయణరావు ల సహకారంతో మచిలీపట్నంలో కులమతాలకు అతీతంగా అందరికీ ఉపయోగపడే విధంగా పట్టాభి స్మారక భవనాన్ని నిర్మించి ఆ భవనం ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ రకాల శిక్షణలు ఇప్పించి వారి ఆర్థిక అభివృద్ధికి ఆ భవనం తోడ్పాటు అందించేలా కచ్చితంగా చేస్తాము అన్నారు.
బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు, ఏ ఆర్ కె మూర్తి మాట్లాడుతూ…..
హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలు నేటి భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం అందరిపై ఉందని, అందులో భాగంగా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ముందుకు వచ్చి మన గ్రంధాల విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా కృషి చేయాలని, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అన్నారు.
సమాజ క్షేమాన్ని కోరేటటువంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండే రాజకీయ నాయకులకు తమ పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది అన్నారు.
కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు, కానుకొలను ఫణి కిరణ్ శర్మ, ఎం. సుబ్రహ్మణ్యం, కావూరి రాధాకృష్ణమూర్తి, పి ఎస్ ఎస్ ఆర్ శర్మ, జి ఎస్ ఎస్ ఆర్ శర్మ, వడ్లమన్నాటి మారుతి దివాకర్, జే ఎస్ ఆర్ మూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, చోడవరపు లక్ష్మీ ప్రసన్న, ప్రముఖ న్యాయవాది, సర్వా లలిత కుమారి లతోపాటుగా సన్మాన గ్రహీతలు, వేణుగోపాల స్వామి దేవాలయం ఆలయ చైర్మన్, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, మచిలీపట్నం నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, వేమూరి సాయి తదితరులు పాల్గొన్నారు.

