The Desk…Kaikaluru : నియోజకవర్గ నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : డా. కామినేని

The Desk…Kaikaluru : నియోజకవర్గ నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి : డా. కామినేని


ఏలూరు జిల్లా : కైకలూరు : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత అందరూ కైకలూరు లో నేడు జరగబోవు మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు శాసనసభ్యుడు డా. కామినేని శ్రీనివాస్ నిరుద్యోగ యువతకు బుధవారం ఓ ప్రకటన లో పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగ యువతకు ఇది ఒక మంచి సువర్ణావకాశం అని.. ఈ జాబ్ మేళాలో 12 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలియజేశారు. నేటి ఉదయం 10:00 గంటలకు కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా నందు 12 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించ బడుతుంది. కావున అర్హులైన నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని సధ్వినియోగం చేసుకో వాలని కోరారు.

ఈ జాబు మేళాలో కంపెనీల వారికి సమ ర్పిం చాల్సిన పత్రాలు వాటి వివరాలు.. ఆధార్ కార్డు, (రెస్యూమ్) లేదా బయో డెటా ఫామ్ తో వివరాలను తెలియపరచాలి. ఈ జాబ్ మేళా కొచ్చే వారంతా గమనించాల్సిన విషయం రిజిస్ట్రే ష్రన్ చేసుకునే యువత ఉదయం 09:00 గంటలకు హాజరుకాగలరని కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం తెలిపింది.