The Desk…Srisailam : శ్రీశైలం మల్లన్న సేవలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

The Desk…Srisailam : శ్రీశైలం మల్లన్న సేవలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ

ఏలూరు జిల్లా : కైకలూరు / శ్రీశైలం : ది డెస్క్ :

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని కైకలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ బుధవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా జయ మంగళ మాట్లాడుతూ.. శ్రీశైలం మ‌ల్లికార్జున స్వామి వారిని పవిత్రమైన కార్తీక మాసంలో ద‌ర్శించుకోవ‌డం తన పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాన‌ని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తెలిపారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. శ్రీశైలంలో వేంచేసి ఉన్న మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మ‌రాంభ అమ్మ‌వారిని ఎన్నిసార్లు చూసినా త‌నివితీర‌ద‌న్నారు. స్వామి వారిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

స్వామి వారి ద‌య వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ బాగుండాల‌ని ప్రార్థించారు. శ్రీశైలం ఆల‌యం ఎంతో అభివృద్ధి చెందింద‌ని పేర్కొన్నారు. తిరుమ‌ల మాదిరిగానే శ్రీశైలం స‌న్నిధి కూడా అహద్భుతంగా అభివృద్ధి చెందాలని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జయమంగళ పేర్కొన్నారు.

జయమంగళ వెంట జనసేన పార్టీ కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ వెంకన్న బాబు, మైగాపుల రామాంజనేయులు, చెన్నం శెట్టి నంద కిషోర్, ఖాదర్ భాషా, ఆముదాలపల్లి వీర బ్రహ్మం, బావిశెట్టి మణికంఠ, ఎమ్ ఎస్ రాజు, కే .బసిరెడ్డి, సతీష్, వాసు, పలువురు నేతలు పాల్గొన్నారు.