కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా.. మచిలీపట్నం
సీతారామాంజనేయ రైస్ మిల్లు ను సందర్శించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్ర భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ,రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్, ఎండి ఢిల్లీ రావు.
మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్…
ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో చరిత్ర సృష్టిస్తున్నాం.!
రాష్ట్రంలో 51లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం..
కృష్ణాజిల్లాలో ఇప్పటివరకు 38 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ఇది చరిత్ర..
ఎప్పుడు లేని విధంగా రైతు ఖాతాల్లో 48 గంటల్లో డబ్బులు వేస్తామన్న హామీని అమలు చేశాం..
మరో అడుగు ముందుకేసి నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు చేపట్టాం..
ఇప్పటివరకు 650 కోట్లు ధాన్యం కొనుగోలు చేసాం 92% ఖాతాలో జమ అయ్యే ఈ విధంగా ఏర్పాటు చేసాం..

