కృష్ణాజిల్లా : మోపిదేవి : ది డెస్క్ :
కార్తిక మాసాన్ని పురస్కరించుకుని కృష్ణాజిల్లా మోపిదేవి లో వేంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని మంగళవారం ఉదయం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆచరించారు.
ఈ సందర్భంగా దేవాలయ వేదపండితులు పాలకవర్గ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు ఆచరింప చేశారు.
దేవాలయంలో గల నాగేంద్ర స్వామి పుట్ట లో పాలు పోసి మంత్రి రవీంద్ర ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం రోజు రోజుకు భక్తుల విశ్వాసాన్ని పెంపొందించుకుంటుందన్నారు
ఈ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మంగళవారం శుక్రవారం తో పాటు ఆదివారం ఈ దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారని అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్తీకమాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

