🔴 తిరుచానూరు : ది డెస్క్ :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు నాని, ఇతర ప్రజా ప్రతినిధులు, టీటీడీ అధికారులుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పించడం అనేది నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను.
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పంచమి తీర్థం నాడు దాదాపు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ఆలయాలలో భక్తుల రాక అమాంతం పెరిగిపోయింది. గత ప్రభుత్వంతో పోలిస్తే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 నుంచి 40% మంది భక్తుల రాక ఆలయాలకు పెరిగింది.
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాద వితరణవచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాద వితరణ చేయాలని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20 తారీకు ఉదయం తిరుచార్నూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు తిరుమల వెళ్తారు.
రాష్ట్రపతి రాకను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయింది. కార్తీక మాస చివరి సోమవారం కావడంతో ప్రతి క్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు పరకామణి కేసు, కల్తీ నెయ్యి కేసు విషయం లో విచారణలు జరుగుతూ ఉన్నాయి.. సమస్యను పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంది ప్రభుత్వంకి వచ్చిన నివేదికల ఆధారంగా కారుకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

