The Desk…Eluru/Denduluru/Jangareddigudem : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

The Desk…Eluru/Denduluru/Jangareddigudem : ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఏలూరు – వట్లూరు సమీపంలో సీతాపురం (రాఘవ ఎస్టేట్) వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదివారం ఆవిష్కరించారు.

  • సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..

తెలుగు జాతి మరిచిపోలేని మహా మనిషి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది బీసీలకు రాజకీయ భవిష్యత్తు లభించిందన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్నామని ఎంపీ పుట్టా మహేష్ స్పష్టం చేశారు. పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎంపీ హమీ ఇచ్చారు.


యాదవ కార్తీక వన సమారాధనలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్

‎సాంప్రదాయ వృత్తులతో పాటు యాదవులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. అన్ని కులాలతో సఖ్యతగా ఉంటూనే, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు.

తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఏలూరు పార్లమెంట్ ప్రజల రుణం తీర్చుంటాననని, గత ఏడాదిన్నరగా రైతులు, యువత, రోడ్లు, ఆర్వీబీలు, రైల్వే మరియు పరిశ్రమలతో ఏలూరు పార్లమెంట్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు.

రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం :

‎నిధుల సమస్య ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్ల సమస్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని, ప్రాధాన్యతా క్రమంలో రోడ్ల పనులు చేపడుతున్నామన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. జంగారెడ్డిగూడెం ఏలూరు మధ్య రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

జంగారెడ్డి గూడెం నుంచి ఏలూరు వెళ్ళేవాళ్ళు కొయ్యలగూడెం మీదగా తిరిగి వెళ్తున్న పరిస్థితుల్లో,  న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ndb)  నిధులతో 6 కిలోమీటర్ల మేర చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదివారం శంకుస్థాపన చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఈరోడ్డు పై పూర్తి నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక, అధికారులతో, కాంట్రాక్టు కంపెనీతో మాట్లాడి పనులు మొదలుపెట్టామన్నారు ఎంపీ.

ప్రస్తుతం మొదటి దశలో జంగారెడ్డిగూడెం నుంచి దేవులపల్లి వరకు ఒక వర్క్, దేవులపల్లి నుంచి తడికలపూడి వరకు ఇంకో వర్క్ గా పనులు చేయనున్నారు. ప్రస్తుతం రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. తాజాగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం పట్ల చింతలపూడి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.