🔴 ప.గో.జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానంలో ఆదివారం ఉదయం దేవస్థానం కళా ప్రాంగణంలో మాల దీక్షదారులచే.. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జునశర్మ కలశస్థాపన పూజ చేసి వేదోక్తముగా సామూహిక కుంకుమ పూజలు జరిపి,తన స్వంత ద్రవ్యముతో మాలధారణ భక్తులకు ప్రసాదాలు అందచేశారు.
16 వ తేది ఆదివారం తెల్లవారుజాము నుండి ఇరుముడి, పూర్ణాహుతి కార్యక్రమం జరుపబడుతుందని, ఇప్పటికే ప్రధాన హోమగుండం, యోని గుండం నిర్మాణాలు పూర్తి చేసి తుది మెరుగులు దిద్ది శనివారం సాయంత్రానికి సిద్ధం చేయనున్నామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. మాలధారణ భక్తులు, భక్తి శ్రద్దలతో ఇరుముడి కార్యక్రమం పూర్తి చేసికొని ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

