The Desk…Eluru : ‎”కే- శాట్” శాటిలైట్ సర్వీస్ స్టేషన్ ను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బృందం

The Desk…Eluru : ‎”కే- శాట్” శాటిలైట్ సర్వీస్ స్టేషన్ ను సందర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ బృందం

🔴 ఏలూరు/ట్రోంసో-నార్వే : ది డెస్క్ :

నార్వే పర్యటనలో ఉన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఇతర ఎంపీల బృందం శుక్రవారం పలు సమావేశాలు, పలు సంస్థల సందర్శనలో బిజీగా గడిపింది. ఉదయం ట్రోంసో నగరంలో స్థానిక వ్యాపారవేత్తలు, పలు పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో భారత ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో భారత్ – నార్వే దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పెంపునకు సంబంధించి చర్చలో పాల్గొన్న ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. భారత్ సందర్శించవలసిందిగా నార్వే పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

అనంతరం ప్రెస్ట్‌వానెట్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఇక్కడ అమలు చేస్తున్న విద్యా విధానం గురించి అకాడమీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ భారత ఎంపీలకు వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎంపీల బృందం వాతావరణ, నిఘా సమాచారాన్ని అందించే ప్రఖ్యాత “కే- శాట్” శాటిలైట్ సర్వీస్ స్టేషన్ ను సందర్శించారు.

రాడార్ మరియు ఆప్టికల్ వనరుల నుండి డేటాను ఉపయోగించి సముద్ర పర్యవేక్షణ మరియు నిఘా సేవలందించడంలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ అయిన KSAT సందర్శించడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. “నాలెడ్జ్ ఎక్చేంజ్” ప్రోగ్రాంలో భాగంగా నార్వేలో గత ఆరు రోజులుగా కొనసాగుతున్న భారత ఎంపీల పర్యటన శనివారంతో ముగుస్తుంది.

.