కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :
మోంత తుఫాను కారణంగా జిల్లాలో పంట నష్టం అంచనా వేయుటకు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి కంకిపాడు మండలం పునాదిపాడులో మొంత తుఫానుకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు.
వారు అక్కడ నేల వాలిన వరి పైరులను పరిశీలించారు
అనంతరం రైతులతో పంట నష్టం వివరాలను ముఖాముఖి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు మోంత తుఫాను బలమైన ఈదురుగాలులకు వరి పంట నేల వాలిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం వారు గన్నవరం ఎంపీడీవో కార్యాలయం సందర్శించి అక్కడ పంట నష్టం వివరాలపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, ఉయ్యూరు ఆర్డిఓ బిఎస్ హేలా షారోన్, డీఎస్ఓ మోహన్ బాబు, వ్యవసాయ శాఖ ఏడి మణిధర్, కంకిపాడు ఏవో ఉషారాణి, గన్నవరం తహసీల్దార్ శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత తదితర అధికారులు పాల్గొన్నారు.

